• Oct 05, 2025
  • NPN Log

    గజ్వేల్‌ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ విజయదశమి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబసభ్యులతో కలసి దుర్గామాత పూజ, ఆయుధపూజ, వాహన పూజలను నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్‌, కేటీఆర్‌ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయంగా విజయదశమిని ప్రజలు జరుపుకొంటారని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement