• Oct 11, 2025
  • NPN Log

    అమరావతి : కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘ధన-ధాన్య కృషి యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కృషి విజ్ఞాన కేంద్రా లు, మార్కెట్‌ కమిటీల్లో ఈ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించి, వర్చువల్‌గా ప్రధాని సందేశాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆరేళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో దేశంలో పంటల ఉత్పాదన, సాంద్రత, రుణపరపతి తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చే శారు. 2025-26లో దేశవ్యాప్తంగా 100 జిల్లాలు ఎంపికవ్వగా, రాష్ట్రంలోని అల్లూరి, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చే శారు. ధన-ధాన్య కృషి పథకం ప్రణాళిక, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి సమితి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా వ్యవసాయ-సహకారశాఖ కార్యదర్శి ఉండనున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృష్టితో ఈ పథకాన్ని చేపట్టినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement