నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు
అమరావతి : ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025ను ప్రకటించింది. ప్రజాసేవ, సామాజికంగా ప్రభావితం చేసే అంశా ల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో నవంబరు 4న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు. గతంలో ఈ అవార్డును దక్కించుకున్న వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, హిందుజా గ్రూప్ కో-చైర్మన్ గోపీచంద్ తదితరులు ఉన్నారు.
Comments