నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉండేలా చర్యలు: మంత్రి అనగాని
ఆంధ్రప్రదేశ్ : గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజనలోని లోపాలను సవరించడంపై క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ చర్చించింది. సిఎం ఆదేశాలు, మంత్రులు ఇచ్చిన సూచనలను పరిశీలించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మండల, పంచాయతీలను విభజించకుండా నియోజకవర్గమంతటినీ ఒకే డివిజన్‌లో ఉంచాలని నిర్ణయించామన్నారు. కాగా కేంద్రం చేపట్టే జనగణనకు ముందే విభజనపై నివేదికను అందిస్తామని మంత్రి మనోహర్ తెలిపారు.










Comments