• Apr 19, 2026
  • NPN Log

    మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి బిజీ జీవితంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రిపూట కొన్ని ఆహారాలను తీసుకోవడం మానుకుంటే మంచి నిద్ర పొందవచ్చు.

    కెఫీన్ ఉన్నవి:

    కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు వంటి వాటిలో కెఫీన్ ఉంటుంది. ఇవి మెదడును చురుకుగా ఉంచి నిద్ర పట్టకుండా చేస్తాయి.

    మసాలా, వేయించిన ఆహారం:

    మసాలా, వేయించిన ఆహారం తింటే కడుపులో మంట, ఎసిడిటీ కలుగుతుంది. దీంతో నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. పిజ్జా, బర్గర్, మటన్ వంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో నిద్రలో అంతరాయం కలుగుతుంది.

    చక్కెర పదార్థాలు:

    కేకులు, స్వీట్లు తింటే రక్తంలో చక్కెర పెరిగి నిద్ర భంగం కలుగుతుంది.

    ఆమ్ల గుణం ఉన్న ఆహారం:

    నిమ్మకాయ, నారింజ, టమోటా వంటి వాటిని రాత్రిపూట తింటే గుండెల్లో మంట కలుగుతుంది. అలాగే, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ తింటే కడుపులో గ్యాస్ ఏర్పడి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.

     

    మద్యం:

    మద్యం తాగితే మొదట నిద్ర వచ్చినట్టు అనిపించినా, తర్వాత నిద్ర సరిగా ఉండదు. మంచి నిద్ర కావాలంటే రాత్రిపూట తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పై చెప్పిన ఆహారాలను నివారిస్తే మంచి నిద్రతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement