• Apr 19, 2026
  • NPN Log

    వేసవిలో మిగతా సౌందర్య సాధనాలతో పాటు లిప్‌స్టిక్స్‌ కూడా మార్చుకోవాలి. ఈ కాలంలో చెక్కుచెదరని లిప్‌ మేకప్‌ కోసం లిప్‌ స్టిక్స్‌ బదులుగా, లిప్‌ టింట్స్‌ ఎంచుకోవాలి.

    వాటర్‌ లేదా జెల్‌ ఆధారిత లిప్‌ టింట్స్‌/లిప్‌ స్టెయిన్స్‌ వేసవికి అనువైనవి. వీటిని పెదవులకు అద్దుకోవడం కోసం డో ఫుట్‌ అప్లికేటర్‌ ఉపయోగించాలి. ఒకసారి పెదవుల మీద సెట్‌ అయితే రంగు తగ్గడం, పెదవులు దాటి విస్తరించడం లాంటి ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. పానీయాలు తాగినా, నీళ్లలో మునకలేసినా ఈ లిప్‌ టింట్స్‌ చెదిరిపోవు. తేలికపాటి టెక్స్‌చర్‌ వల్ల చమటకు చెదిరిపోకుండా ఉంటాయి. పైగా పెదవులకు లిప్‌స్టిక్‌ వేసుకున్న భావన కలగదు.

    రంగులు: సహజసిద్ధ గులాబీరంగులు, బెర్రీ టోన్స్‌ వేసవికి తగిన రంగులు

    బామ్‌: పెదవులకు బామ్‌ అప్లై చేసి ఆ తర్వాత టింట్స్‌ పూసుకుంటే, పెదవులు మరింత తేమగా ఉంటాయి

    టిష్యూ: పెదవులకు అద్దుకున్న లిప్‌ టింట్‌ చెదరకపోయినా, ఎండలోకి వెళ్లినప్పుడు టిష్యూతో అద్దుకుంటూ ఉండడం వల్ల తాజాదనం కొనసాగుతుంది

    గ్లాస్‌: పెదవులకు మరికాస్త మెరుపు జోడించాలనుకుంటే లిప్‌ గ్లాస్‌ కూడా అప్లై చేసుకోవచ్చు

    ప్రెప్‌: లిప్‌స్టిక్‌ మాదిరిగానే లిప్‌ టింట్‌కు ముందు పెదవులను స్క్రబ్‌ చేసి సిద్ధం చేయాలి

    తేమ: పెదవులు మరింత మృదువుగా, తేమగా ఉండడం కోసం మన్నికైన మాయిశ్చరైజర్‌ను అప్లై చేసి, ఆ తర్వాత లిప్‌ టింట్‌ వాడుకోవాలి

    పార్టీ వేర్‌: ముదురు ఎరుపు, గోధుమ రంగు, మెరూన్‌ రంగులు ఈవినింగ్‌ పార్టీలకు బాగుంటాయి

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement