పాపం.. మస్తాన్ వలి చనిపోయాడు.. ఏం జరిగిందంటే..
అనంతపురం: నగరంలోని క్లాక్ టవర్ ఫ్రైఓవర్ వంతెనపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపోవనం ప్రాంతానికి చెందిన దూదేకుల మస్తాన్ వలి(32)దుర్మరణం చెందాడు. అనంతపురం ట్రాఫిక్ పోలీసులు తెలిపిన మేరకు నారాయణపురం పంచాయతీలోని తపోవనానికి చెందిన మస్తాన్ వలి నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నాడు.
భార్య ఆశాతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన ద్విచక్రవాహనంపై నగరంలోకి బయల్దేరాడు. అయితే క్లాక్‌టవర్ ఫ్లైఓవర్ వంతెన మధ్యలోకి రాగానే ఎలా జరిగిందో తెలియదు కానీ ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద మస్తాన్‌వలి పడ్డాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అదృష్టవశాత్తు ఆయన భార్య ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతపురం ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments