ప్రజలు తినే పంటలు పండిస్తే మంచిది: సిఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ : రాయలసీమలో వరికాకుండా ఇతర పంటలు పండిస్తున్నారని, కోస్తాలో కూడా తినేరకాలు పండించాలని సిఎం చంద్రబాబు రైతులకు సూచించారు. ‘పంటకు ఫలితం ఉండాలంటే తినే వాళ్లుండాలి. ప్రజలు తినని వాటిని పండిస్తే లాభమేంటి? ఇప్పటికే ధాన్యం వాడకం తగ్గిపోతోంది’ అని చెప్పారు. అలా చేయకుండా తనను ఎన్ని తిట్టినా ఫలితం లేదన్నారు. కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్ తినకూడదని దానివల్లే అందరికీ షుగర్ అని అన్నారు. కోనసీమలో పంటల్ని సిఎం చంద్రబాబు పరిశీలించారు.









Comments