పోర్టు కట్టమని అమెరికా ని కోరిన పాక్!
ఇటీవలే వారి దేశంలో భూఖనిజాలు తవ్వేందుకు అమెరికా కంపెనీతో ఒప్పందం చేసుకున్న పాక్.. ఇప్పుడు పోర్టు కట్టేందుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సలహాదారులు ఈ విషయంలో వైట్ హౌజ్‌ని సంప్రదించినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని గ్వాదర్ జిల్లా పాస్నిలో పోర్టు నిర్మించి నడపాలని అమెరికా ఇన్వెస్టర్స్ భావిస్తున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. ఖనిజాల రవాణాకు దీనిని వాడతారని తెలుస్తోంది.
Comments