పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలు
న్యూఢిల్లీ : లోక్‌సభ సెక్రటేరియట్ పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను బుధవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఈ కమిటీల్లో చోటు దక్కించుకున్నారు. తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కే లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, డీకే అరుణ సహా పలువురు వేర్వేరు కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు. ఇక, ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో కే లక్ష్మణ్, మేడా రఘునాథ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. గుమ్మ తనూజ రాణి, చామల కిరణ్‌కుమార్ రెడ్డికి ఈ కమిటీలో సభ్యులుగా స్థానం దక్కింది. వాణిజ్య పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రేణుకా చౌదరి, సానా సతీష్ బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా కడియం కావ్య, పరిశ్రమల కమిటీలో మల్లు రవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, అభిషేక్ మను సింఘ్వి చోటు దక్కించుకున్నారు. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా మాధవనేని రఘునందన్ రావు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల కమిటీ సభ్యులుగా కేఆర్ సురేశ్ రెడ్డి, పాకా వెంకట సత్యనారాయణ, గడ్డం వంశీకృష్ణ, రవాణా, పర్యాటకం, సాంస్కృతికం కమిటీ సభ్యుడిగా గొల్ల బాబూరావు నియమితులయ్యారు. రసాయనాలు, ఎరువుల కమిటీ సభ్యులుగా బలరాం నాయక్, ఈటల రాజేందర్, దగ్గుమళ్ల ప్రసాదరావు, బొగ్గు, గనులు, ఉక్కు కమిటీ సభ్యులుగా మందాడి అనిల్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. కమ్యూనికేషన్స్, ఐటీ కమిటీ సభ్యులుగా ఎస్ నిరంజన్ రెడ్డి, కలిశెట్టి అప్పల నాయుడు, రామసహాయం రఘురామి రెడ్డి నియమితులయ్యారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కమిటీ సభ్యురాలిగా ఇన్ఫోసిస్ సుధామూర్తి నియామకం పొందారు. రక్షణ శాఖకు చెందిన కమిటీలో ధీవకొండ దామోదర్ రావు, కేశినెని శివనాథ్, విదేశీ వ్యవహారాల కమిటీలో అయోధ్య రామిరెడ్డి, కే లక్ష్మణ్, డీకే అరుణ, వైఎస్ అవినాష్ రెడ్డికి సభ్యులుగా చోటు లభించింది. అలాగే, ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, సీఎం రమేష్, పీవీ మిథున్ రెడ్డి, బాలశౌరి వల్లభనేని, ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి, కార్మిక, వస్త్ర మరియు నైపుణ్యాభివృద్ధి కమిటీ సభ్యుడిగా జీ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఇక, పెట్రోలియం, సహజ వాయువుల కమిటీ సభ్యులుగా వద్దిరాజు రవిచంద్ర, పుట్టా మహే్‌షకుమార్ యాదవ్, బాలశౌరి వల్లభనేని, సామాజిక న్యాయం, సాధికారత కమిటీ సభ్యుడిగా విజయేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.
Comments