ప్రైవేట్ ట్రావెల్స్‌ను కట్టడి చేయాలి
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కట్టడి చేసి, ఆర్టీసీ ద్వారా దూర ప్రాంత సర్వీసులు ప్రవేశపెట్టాలని ఆ సంస్ధ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోధరరావు, జి.వి.నరసయ్య శనివారం ఒక ప్రకటనలో కోరారు. ‘దేశంలోనే అత్యంత సురక్షిత ప్రయాణాన్ని అందించేది ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా అధునాతన సౌకర్యాలతో దూర ప్రాంతాలకు నడిపేందుకు ఏసీ, ఏసీ స్లీపర్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీయే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని వారు కోరారు.










Comments