పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: సిఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ : వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వేగంగా చేపట్టాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. నీరు నిలవకుండా డ్రైనేజీల్ని పటిష్ఠం చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి నిత్యావసరాలు అందించాలన్నారు. కాగా రాష్ట్రంలో 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని అధికారులు వివరించారు.










Comments