ఫోన్లో 100% ఛార్జింగ్ మంచిదేనా?
ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదని ఎక్స్‌పర్టులు హెచ్చరిస్తున్నారు. ‘100%’లో ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి ఉండటం వల్ల బ్యాటరీలపై అధిక వోల్టేజ్ ఒత్తిడి పడుతుందని అంటున్నారు. దీంతో బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుందని, 10-15 శాతం వరకు లైఫ్ పడిపోతుందని చెబుతున్నారు. 20-80% మధ్య ఛార్జింగ్ ఉంటే ఫోన్లు ఉత్తమంగా పని చేస్తాయంటున్నారు. అత్యవసర సమయాల్లో ఫుల్ ఛార్జ్‌తో వాడుకోవచ్చని సూచిస్తున్నారు.










Comments