ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవాళ షెడ్యూల్!
తెలంగాణ : ఇంటర్ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 23 నుంచే నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే గత 13 ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవడంతో అదే సెంటిమెంట్ దృష్ట్యా 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.










Comments