బస్సు ప్రమాదం.. పరిహారం అందజేసిన ట్రావెల్స్ యాజమాన్యం
కర్నూలు బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వి.కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పరిహారం అందజేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.40 లక్షలను మంత్రి భరత్ సమక్షంలో అందజేసింది. మొత్తం ఈ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. అటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
  
                      
                               
  








 
  
 
Comments