మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు!
తెలంగాణ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మే తొలి వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు SSC బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు కొనసాగుతుండగానే సమాంతరంగా ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. సైన్స్, సోషల్ వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుందని సమాచారం.










Comments