మేడారం జాతరలో 108 అంబులెన్స్ మెడిసిన్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన జిల్లా మేనేజర్ రాజు నాయక్
మేడారం జాతర సందర్భంగా భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని భూపాలపల్లి జిల్లా 108 మేనేజర్ రాజు నాయక్ తెలిపారు.
జాతర నిర్వహణలో భాగంగా మేడారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన 108 అంబులెన్సులలో ఉన్న మెడిసిన్ స్టాక్, ఎక్విప్‌మెంట్, రికార్డులు,డాక్యుమెంట్లను పూర్తిగా వెరిఫై చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని సిబ్బందితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ,“భక్తుల ఆరోగ్య భద్రతే మా ప్రధాన లక్ష్యం. ఏ చిన్న నిర్లక్ష్యం లేకుండా ప్రతి అంబులెన్స్ సిద్ధంగా ఉండాలి. సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.జాతరలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా వెంటనే స్పందించేలా 108 సిబ్బందిని ప్రత్యేకంగా అలర్ట్‌లో ఉంచినట్లు తెలిపారు.










Comments