మద్యం స్కామ్ కేసులో ఏడుగురికి షాక్
విజయవాడ : మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా అందరి బెయిల్ పిటిషన్లనూ కొట్టివేసింది. న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీచేశారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్య, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణ బెయిల్ పిటిషన్లపై వాదప్రతివాదాలు ముగియడంతో భాస్కరరావు తీర్పును వెలువరించారు. రిమాండ్‌ను వచ్చే నెల ఏడోతేదీ వరకు పొడిగించారు.










Comments