మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
తమ ఖాతాదారులకు వెసులుబాటు కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను చెక్ చేసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు పాస్‌బుక్ మన ఖాతాలకు సంబంధించి డబ్బులను వేరే సైట్ నుంచి లాగిన్ చేసి చూసుకునేవాళ్ళం. ప్రతి సారి లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడం ఖాతాదారులకు కష్టంగా మారడంతో బ్యాలెన్స్ చూసుకునేందుకు ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరాన్ని తగ్గించింది.
ఇక ఒకే మెంబర్ పోర్టల్‌లో పాస్ బుక్ కేటగిరిలో పాస్ బుక్ లైట్‌పై క్లిక్ చేసి మన పీఎఫ్ సమాచారాన్ని చూసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించించారు. ఈ ఆప్షన్ లో పీఎఫ్ కాంట్రిబ్యూషన్, విత్‌డ్రా, బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు, గ్రాఫిక్స్‌తో కూడిన సమాచారం కావాలంటే పాస్‌బుక్ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు. దీనివల్ల యూజర్ ఫాస్ట్‌గా తన బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు సింగిల్ లాగిన్‌తోనే ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంటాయి.
 
 
                     
                              
  









 
 
Comments