మామిడి పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే?
స్పైసీ ఫుడ్, కాకరకాయ కూరతోపాటు మామిడి పండ్లను తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అజీర్తి, వికారం తలెత్తవచ్చని చెబుతున్నారు. ‘మ్యాంగోలను తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీరం పోషకాలను గ్రహించే వేగం మందగిస్తుంది. జీర్ణ ప్రక్రియ ఆలస్యమై అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. 30ని.ల తర్వాత నీరు తాగొచ్చు. పండ్లతోపాటు కూల్ డ్రింక్స్ తాగితే బాడీలో చక్కెర స్థాయులు పెరుగుతాయి’ అని పేర్కొంటున్నారు.










Comments