మ్యాచ్ రద్దు.. ఉమెన్స్ వరల్డ్ కప్లో పాక్కు ఘోర అవమానం
ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇవాళ పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే భారీ వర్షం పడగా అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. అంతకుముందే ఇరు జట్లు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7 మ్యాచ్ల్లో పాక్ ఒక్కటీ గెలవలేదు. 4 మ్యాచ్ల్లో ఓడిపోగా 3 రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.










Comments