ట్రోఫీ కొట్టేసిన నఖ్వి.. అసలేం జరిగిందంటే..?
దుబాయ్ : ఆసియా కప్ ట్రోఫీకి సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయంపై ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వి వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఫైనల్‌లో భారత్- పాకిస్తాన్ తలపడగా.. టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుకు ఇవ్వాల్సిన ట్రోఫీని నఖ్వి అబుదాబిలో లాక్ చేసి ఉంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలైన ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నప్పటికీ.. విజేతలకు అందించే రెప్లికాను నఖ్వి తన ఆధీనంలో ఉంచుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.
నఖ్వికి బీసీసీఐ వార్నింగ్!
నఖ్వి తీరుపై బీసీసీఐ(BCCI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రోఫీని వెంటనే టీమిండియాకు విడుదల చేయకపోతే ఈ వివాదాన్ని ఐసీసీ(ICC)కి తీసుకెళ్తామని బీసీసీఐ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ట్రోఫీని అందించడంలో జరిగిన ఆలస్యం ఇప్పుడు ఇరు బోర్డుల మధ్య పూర్తి స్థాయి అధికార వివాదంగా మారింది.
ట్రోఫీపై నఖ్వి షరతులు..
ఈ వివాదంపై నఖ్వి బీసీసీఐకి మెయిల్ పంపినట్లు సమాచారం. ‘ఆసియా కప్ ట్రోఫీ భారత జట్టుకు చెందుతుంది. బీసీసీఐ ఆఫీస్ హోల్డర్‌తోపాటు భారత ఆటగాళ్లలో ఒకరు వచ్చి తీసుకునే వరకు ట్రోఫీ అలాగే ఉంటుంది. దాంతోపాటు ఆట స్ఫూర్తిని దెబ్బతీయకుండా అట్టహాసంగా, కవరేజీతో వేడుక జరిపి ట్రోఫీ తీసుకెళ్లాలి’ అంటూ షరతులు విధించాడు.









Comments