సిడ్నీలో అదే జరిగితే.. విరాట్ పేరిట చెత్త రికార్డు
భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుంది. రెండు మ్యాచ్‌లు ఆడి గెలిచిన ఆసీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో సిడ్నీ లో టీమిండియా తో నామమాత్రపు మ్యాచ్‌లో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్‌లో కూడా అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. గత రెండు వన్డేల్లో బ్యాట్‌కు పని చెప్పకుండా డకౌట్ అయిన కింగ్.. మూడో మ్యాచ్‌లో కూడా ఇదే రిపీట్ అయితే తన పేరు మీద ఓ చెత్త రికార్డు లిఖించుకునే ప్రమాదం ఉంది.
భారత్-ఆసీస్ సిరీస్‌లో విరాట్ పరుగుల ఖాతా తెరవలేదు. సిడ్నీలో కూడా సున్నా పరుగులకే ఔటైతే.. క్రికెట్ చరిత్రలోనే వరుసగా డకౌట్ అయిన ఆరో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ వంటి దిగ్గజాలు ఉన్నారు. సిడ్నీలో కోహ్లీ పరుగుల ఖాతా తెరవలేకపోతే ఒకే వన్డే సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన తొలి భారత ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. అయితే సిడ్నీలో విరాట్ మునపటి ప్రదర్శన కూడా అంతగా బాలేదు. అదే కోహ్లీ అభిమానులకు కాస్త ఆందోళన కలిగిస్తుంది. కోహ్లీ సిడ్నీలో ఆడిన 7 వన్డే మ్యాచ్‌లలో కేవలం 146 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 25 కంటే తక్కువగా ఉంది. ఈ పేలవమైన గణాంకాలు మూడో వన్డేపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.










Comments