• Apr 19, 2026
  • NPN Log

    వాషింగ్టన్‌ : శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్‌ అంగీకరించిందంటూ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తమమధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు మార్గం సుగమం అయిందని కూడా తెలిపారు. రెండో విడత చర్చలకు అమెరికా-ఇరాన్‌ సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ ట్రంప్‌ ప్రకటన ఆసక్తి రేపింది. అణ్వాయుఽధ కార్యక్రమాన్ని ఇరాన్‌ వదులుకోవాల్సిందేనని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికా-ఇరాన్‌ ఇస్లామాబాద్‌ వేదికగా జరిపిన తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం సంధి కుదురుతుందనే ధీమాను ట్రంప్‌ వ్యక్తం చేశారు. అదే జరిగితే, తానే స్వయంగా పాక్‌కు వెళతానని కూడా ప్రకటించారు. చర్చలపై ఇరాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు. అయితే, రెండు రోజుల్లోనే ఆ ప్రక్రియ మొదలవుతుందనే సంకేతాన్ని ‘న్యూయార్క్‌ పోస్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ అందించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement