‘రేమండ్’ మాజీ ఛైర్మన్ కన్నుమూత
దిగ్గజ టెక్స్‌టైల్ సంస్థ ‘రేమండ్’ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ గ్రహిత విజయ్‌పత్ సింఘానియా (87) కన్నుమూశారు. ముంబైలోని నివాసంలో శనివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు గౌతమ్ సింఘానియా వెల్లడించారు. ఈరోజు ముంబైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1980లో రేమండ్ ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన విజయ్‌పత్.. 20ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు.










Comments