• Oct 27, 2026
  • NPN Log

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారారు. ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్ వస్త్రధారణ, శరీరాకృతిపై ఆయన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి మైక్ రోజర్స్‌తో పాటు మరికొందరు అభ్యర్థుల కోసం మిచిగన్‌లోని పోర్ట్ హ్యురాన్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయనతో పాటు ర్యాపర్ నిక్కీ మినాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ నిక్కీ శరీరాకృతి గురించి జోకులు వేశారు. ఆమె అందాన్ని మిస్ అవడం కష్టమని పేర్కొన్నారు. అదే సమయంలో నిలబడాలని ఆమెను కోరారు. తన వ్యాఖ్యలతో నిక్కీ అవమానపడినట్లుగానీ, బాధపడినట్లుగానీ తాను అనుకోవడం లేదన్నారు. రిపబ్లికన్ పార్టీకి ఆమె మద్దతు ఇస్తున్నదన్నారు.

    ‘నిక్కీ మినాజ్‌ను మనం ప్రేమిస్తాం. ఆమె చాలా కాలంగా మనతో (రిపబ్లికన్ పార్టీ) ఉన్నారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా.. గతంలోనూ పలువురు రిపబ్లికన్ నేతలపైనా ఆయన అలాగే వ్యాఖ్యలు చేసి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవలే కెంటకీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఓహియె సెనేటర్ జాన్ హుస్టెడ్‌పైనా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. ‘జాన్ వెనుకభాగాన్ని నేను గమనించాను. అలాగే ఆయన భుజాలు, పాదాలు, చేతులు చూశాను. ఆయన జాలైన్‌ (దవడ ఆకృతి) కూడా గమనించాను. ఆయనను అధ్యయనం చేశా’ అని ట్రంప్ ఆ కార్యక్రమంలో అన్నారు. అలాగే కెంటకీ నాలుగో కాంగ్రెషనల్ జిల్లా రిపబ్లికన్ నామినీ, నేవీ సీల్ మాజీ అధికారి గాల్రీన్‌ను అందమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆ విమర్శలను ఫేక్ న్యూస్‌గా ట్రంప్ అభివర్ణించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement