రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: కేటీఆర్
తెలంగాణ : అరాచకత్వం, అనుభవలేమితో ఉన్న రేవంత్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సెప్టెంబర్లో GST వసూళ్లలో తెలంగాణ అట్టడుగున ఉండటం దారుణమని దుయ్యబట్టారు. రెండేళ్ల క్రితం కేసీఆర్ పాలనలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని గుర్తు చేశారు. తమ హయాంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలూ నేల చూపులే చూస్తున్నాయని మండిపడ్డారు.
Comments