• Oct 29, 2025
  • NPN Log

    విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆర్యన్‌’   తెలుగులో విడుదల కొత్త తేదీకి మారింది. ముందు ప్రకటించిన విధంగా ఈ నెల 31న ఈ చిత్రం విడుదలవ్వడం లేదు. ఒక వారం ఆలస్యంగా నవంబర్‌ 7న ‘ఆర్యన్‌’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు విష్ణు విశాల్  తెలిపారు. ‘రవితేజ నటించిన ‘మాస్‌ జాతర’, ‘బాహుబలి: ది ఎపిక్‌’ చిత్రాలు కూడా ఈ నెల 31న విడుదలవుతున్నాయి. రవితేజతో నాకున్న స్నేహం, రాజమౌళిపై గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు.


     

    అయితే ‘ఆర్యన్‌’ తమిళ వెర్షన్‌ మాత్రం ఈ నెల 31నే విడుదలవనుంది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఆర్యన్‌’ చిత్రానికి ప్రవీణ్‌ కె దర్శకుడు. శుభ్ర, ఆర్యన్‌ రమేశ్‌ నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. తెలుగ‌మ్మాయి మాన‌సా చౌద‌రి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.సెల్వ రాఘవన్‌ కీలకపాత్ర పోషించారు. శ్రేష్ట్‌ మూవీస్‌ అధినేత సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

    ఇదిలాఉంటే.. విష్ణు విశాల్ న‌టించిన మ‌ట్టీ కుస్తీ సినిమాకు ర‌వితేజ స‌హా నిర్మాత కాగా ఆపై వ‌చ్చిన విష్ణు చిత్రాల‌కు సైతం మాస్ మ‌హ‌రాజా స‌పోర్ట్ అందించారు. ఈ నేప‌థ్యంలో ర‌వితేజ మాస్ జాత‌ర  చిత్రానికి పోటీగా త‌న చిత్రాన్ని పోటీలో ఉంచ‌లేక‌ వాయిదా వేయ‌డం విశేషం. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లెట‌ర్ సైతం రిలీజ్ చేసి సినిమా వాయిదా వేయ‌డంపై తెలుగు వారిని అభ్య‌ర్థించాడు. కాగా విష్ణు విశాల్ ఐదేండ్ల క్రితం మ‌న తెలుగు క్రీడాకారిణి గుత్తా జ్వాల‌ను వివాహాం చేసుకోగా వారికి ఓ పాప సంతానం.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement