రాష్ట్రానికి 4 కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. చిత్తూరు జిల్లా మంగసముద్రం, బైరుగానిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతి శాఖమూరులో వీటిని ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అటు తెలంగాణ రాష్ట్రానికి సైతం కేంద్రం నాలుగు కేంద్ర విద్యాలయాలను ప్రకటించింది.
Comments