• Apr 19, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : అమెరికా విధించిన ఆంక్షల మినహాయింపు గడువు ముగిసినప్పటికీ రష్యా నుంచి ముడిచమురు, వంట గ్యాస్‌ (ఎల్పీజీ) దిగుమతులను కొనసాగించాలని భారత్‌ నిర్ణయించుకుంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ ఇంధన అవసరాల కోసం రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అమెరికా గతంలో ఆంక్షలను సడలించింది. 30 రోజుల వరకు ఈ మినహాయింపునివ్వగా అది ఇటీవలే (ఏప్రిల్‌ 11తో) ముగిసింది. ఈ గడువును పొడిగించబోమని బుధవారమే అమెరికా స్పష్టం చేసింది. అయితే ఆంక్షల మినహాయింపులపై అమెరికా నిర్ణయం దాని విచక్షణకు సంబంధించినదని.. అది భారత దిగుమతి వ్యూహాన్ని నిర్దేశించలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘రష్యా నుంచి మరింత ఎల్పీజీ కొనుగోళ్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఆంక్షలు లేని దేశాల నుంచి ముడిచమురు, ఎల్పీజీ దిగుమతులు యథావిధిగా కొనసాగుతాయి’ అని పేర్కొన్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement