• Apr 19, 2026
  • NPN Log

    హైదరాబాద్‌  : ఖరీదైన కారులో తిరుగుతూ.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6.9 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వికాస్‌, భరత్‌ చౌదరి ఇంటీరియర్‌ డిజైనర్లు. వారికి విజయవాడకు చెందిన మురళి అనే మరొకతను ఎండీఎంఏ డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో అందజేసి వెళ్తుంటాడు. అనంతరం వికాస్‌, భరత్‌ చౌదరి ఖరీదైన కారులో తిరుగుతూ.. నగరంలోని కస్టమర్స్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

    సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్‌బీ టీం సీఐ భిక్షరెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. కొండాపుర్‌ ప్రాంతంలో నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గ్రాముకు రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను కొండాపుర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించామని ఎస్‌టీఎఫ్‌ బీటీం లీడర్‌ ప్రదీప్‏రావు తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement