విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు గూడెం, బండ్ల
తెలంగాణ : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పీకర్ ఛాంబర్లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలను పిటిషనర్ల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్లో చేరారని, వీరిపై వేటు వేయాలంటూ మహిపాల్ రెడ్డిపై చింత ప్రభాకర్, బండ్లపై పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. SC ఆదేశాలతో సెప్టెంబర్ 29 నుంచి విచారణ ప్రారంభమైంది.
Comments