విజయ దుందిభీగా విజయదశమి -రావణాసూరిడిని వధించిన మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్ -కన్నుల పండుగవా దసరా ఉత్సవాలు
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో విజయదశమి దుర్గాదేవి వేడుకల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అశేష జనసందోహం వేడుకలు తిలకించడానికి ఉత్సవం చెంతకు తరలి రావడం కన్నుల పండువగా కనిపించింది. నవరాత్రులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజించిన భక్తులు వేడుకలకు హాజరై సంబరాలు జరుపుకోవడం సందడిని నెలకొల్పింది. పండుగ కోలాహాలం నడుమ రాక్షస రావణాసూరుడి ప్రతిమను విల్లు వధించిన మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరుగాల అశోక్ దహనం చేశారు. ప్రజల సంబరాల మధ్య దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఐ బోరగాల అశోక్ మాట్లాడారు. దసరా అనే పండుగ ధర్మానికి అధర్మానికి సూచికని, ధర్మంతో ఎల్లప్పుడూ విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దసరా కమిటీ ఉత్సవ అధ్యక్షుడు వేముల కిరణ్ గౌడ్, దసరా కమిటీ ఉత్సవ నాయకులు లడే రాజు, తిప్పారపు రాజు, చాట్ల రాజు, బండారి రవి కుమార్ యాదవ్, తోట రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే విగ్రహానికి సహకరించిన దాతలకు విగ్రహ కమిటీ అధ్యక్షుడు వేముల కిరణ్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ మండలి భక్తులు మోటే శ్రీధర్, కట్కూరి శ్రీధర్, నాగలగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments