విద్యార్థుల పాలిట శాపంగా మారిన కొర్కిశాల కేజీవీబీ పాఠశాల* *-పాఠశాల ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీనే..పిఈటి పోస్ట్ ఖాళీనే* *-గతంలో ఫుడ్ పాయిజన్* *-సస్పెండైన ప్రిన్సిపాల్, పిఈటి -నేటి వరకు భర్తీ చేయని ఆ పోస్టులు - దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కరువు -ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆటలకు దూరం -వెంటనే పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ -సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామంలో పేద విద్యార్థుల సౌకర్యార్థం నెలకొల్పిన కేజీబీవీ పాఠశాల అనేక సమస్యలతో సతమతమవుతూ తల్లడిల్లుతుంది. ఆ పాఠశాలలో నిత్యం ఫుడ్ పాయిజన్ కేసులు సంభవిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో గత కొన్ని నెలల క్రితం ఆ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరుగగా..విద్యార్థులు అస్వస్థతకు గురై..వాంతులు, విరోచనాలు చేసుకుంటూ..కడుపునొప్పి బాధను భరించలేని విద్యార్థులను ప్రభుత్వ హాస్పిటల్స్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ ను పిఈటిని బాధ్యులను చేస్తూ..వారిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉద్యోగం నుండి తప్పించారు. నాటి నుండి నేటి వరకు ఆ ప్రిన్సిపాల్ మరియు పిఈటి పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులపై పర్యవేక్షణ కరువై..క్రమశిక్షణ లోపిస్తుందని, క్రీడలలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆ పాఠశాలలో పీఈటి పోస్టు లేకపోవడంతో క్రీడా మైదానాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించి ఆ పాఠశాలలో ప్రిన్సిపల్ మరియు పిఈటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు.








Comments