విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 10 నుంచి ఎగ్జామ్స్
తెలంగాణ : ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 20న ఎగ్జామ్స్ ముగుస్తాయి. సమాధాన పత్రాలను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల మార్కులను ISMS పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఓవరాల్‌గా 23న ఫలితాలు విడుదల చేస్తారు. అదే రోజు బడుల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.










Comments