విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదు: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ : విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదంటూ ఓ అర్చకుడు కోర్టులో పిటిషన్ వేశారు.









Comments