వాలంటైన్స్ డే.. ఆ లింక్‌లపై క్లిక్ చేయొద్దు!
తెలంగాణ : వాలంటైన్స్ డే సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. నకిలీ డేటింగ్ ప్రొఫైళ్లు, గిఫ్ట్ ఆఫర్లు, పూల డెలివరీ, డిస్కౌంట్‌ల పేరిట లింక్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాటిపై క్లిక్ చేస్తే నకిలీ పేమెంట్ వెబ్ సైట్లు, యాప్స్ డౌన్‌లోడ్ అయి డబ్బు మాయమవుతాయని తెలిపారు. అటు OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొన్నారు.










Comments