వాహనదారులకు కేంద్రం శుభవార్త
ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం 2 కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. నేషనల్ హైవేల్లో ఫాస్టాగ్ లేని వాహనదారులు ప్రస్తుతం డబుల్ ఛార్జ్ చెల్లిస్తున్నారు. ఇకపై ఫాస్టాగ్ లేకపోయినా UPI ద్వారా 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది. నగదు రూపంలో అయితే రెట్టింపు చెల్లించాల్సిందే. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బున్నప్పటికీ టోల్‌గేటు వైఫల్యంతో అమౌంట్ కట్ కాకపోతే ఫ్రీగా వెళ్లొచ్చు. ఈ రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.
Comments