శనగపిండితో చర్మానికి మెరుపు
చర్మసంరక్షణకు మన పూర్వీకుల కాలం నుంచీ శనగపిండిని వాడుతున్నారు. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొడిచర్మం ఉన్నవారు హైడ్రేషన్ కోసం శనగపిండిని వాడాలంటున్నారు. దీనికోసం 4 స్పూన్ల శనగపిండి, రోజ్‌వాటర్/ నిమ్మరసం, కాస్త తేనె కలపాలి. దీన్ని ఫేస్‌కి, మెడకు పట్టించుకొని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.








Comments