సీఎంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వీగిపోవడంపై ఇరువురి నేతల మధ్య చర్చ జరిగింది. దీనిపై నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాల కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం చంద్రబాబు, మాధవ్ కలిసి హెలికాప్టర్‌లో నిడదవోలు వెళ్లారు. అక్కడ జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.










Comments