సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!
సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మహేశ్ మేనకోడలు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ సోషల్ మీడియా లో ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. మూవీస్‌లోకి రావాలని ఆమె డ్రైవింగ్, డాన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.










Comments