సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ
ఆంధ్రప్రదేశ్ : దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.
Comments