సబిత, సునీత కాంగ్రెస్‌లో చేరట్లేదు: బీఆర్ఎస్ నేత కార్తీక్
తెలంగాణ : బీఆర్ఎస్ MLAలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబిత కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి(యూట్యూబ్ ఛానెల్స్) లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments