స్మార్ట్ఫోన్లకు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయ విపణిలో డిమాండ్ తగ్గడం, వ్యయపరమైన ఒత్తిడుల కారణంగా స్మార్ట్‌ఫోన్ల రవాణా 2026 తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3 శాతం తగ్గింది. ఆరేళ్ల కాలంలో అత్యంత బలహీనమైన త్రైమాసికం ఇది. సమీప భవిష్యత్తులో కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఒత్తిడ కొనసాగుతుందని, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో డిమాండు రెండంకెల స్థాయిలో తగ్గవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదల, ఎంట్రీ స్థాయి స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది.










Comments