సర్వంAI.. ఈసారి జెమినీ ఫ్లాష్, డీప్‌సీక్‌కు పోటీగా
ఇటీవల అక్యూరసీలో చాట్‌జీపీటీ, జెమినీని బీట్ చేసిన సర్వంAI తాజాగా రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) రిలీజ్ చేసింది. 30B, 105B అనే మోడల్స్ బడా ఏఐ మోడల్స్‌కు దీటుగా పనిచేస్తాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 105B LLM జెమినీ 2.5 ఫ్లాష్, చైనాకు చెందిన డీప్‌సీక్ R1 మోడల్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చు కూడా వాటితో పోలిస్తే తక్కువేనని తెలిపింది.










Comments