సిస్టర్స్ డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య
సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీదాబాద్(హర్యానా)కు చెందిన రాహుల్(19)కు తన ముగ్గురు అక్కల మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలను సైబర్ నేరగాళ్లు పంపారు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఫొటోలను సోషల్ మీడియా లో పెడతామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురై రాహుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్‌పై కేసు నమోదైంది. రాహుల్ ఫ్రెండ్ నీరజ్‌పైనా అనుమానాలున్నాయి.









Comments