హోర్ముజ్ నుంచి భారత్, గ్రీస్ నౌకలు వెనక్కి
న్యూఢిల్లీ : ముడిచమురుతో దుబాయ్ జలాల నుంచి హోర్ముజ్ వైపు బయలుదేరిన భారత్, గ్రీస్‌కు చెందిన ఐదు ట్యాంకర్లు శనివారం తెల్లవారుజామున వెనుతిరిగాయని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ప్రస్తుతం వాటిలో కొన్ని యూటర్న్ తీసుకున్న ప్రదేశానికి సమీపంలోని ఖేష్మ్ ద్వీపం పక్కన నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి వీటితో పాటు ప్రయాణం ప్రారంభించిన మరో నౌక నుంచి కొన్ని గంటలుగా ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. ఈ ఆరు నౌకల్లో కలిపి దాదాపు 8.3 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్‌యేతర చమురు ఉంది. ఆ నౌకలు ప్రయాణాన్ని రద్దు చేసుకొనే ఉద్దేశంతో యూటర్న్ తీసుకున్నాయా లేక పెద్దసంఖ్యలో నౌకలు జలసంధి వైపు తరలి వస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణలు ఏవైనా అమల్లో ఉన్నాయా అనేదానిపై స్పష్టత లేదని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మూడు ఎల్‌పీజీ క్యారియర్లు, ఒక చమురు ట్యాంకర్ అదే మార్గంలో ప్రయాణిస్తూ కనిపించాయని, ప్రస్తుతం అవి ఒమాన్ గల్ఫ్‌లోకి మళ్లినట్లు వెల్లడించింది.










Comments