ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్‌పై మోదీ
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన కాల్పుల పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్‌గా గుర్తించారు.










Comments