BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు: మహేశ్ గౌడ్
తెలంగాణ : బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా కేంద్రం తొక్కిపెడుతోందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ‘దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆగలేదు. పోరాటానికి అన్ని పార్టీలు కలసిరావాలి. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాలని సీఎం రేవంత్ రాహుల్ గాంధీని కోరారు. బీజేపీ ఎన్నిరోజులు ఆపాలనుకున్నా అది సాధ్యం కాదు. బిల్లు సాకారమయ్యే రోజు ఎంతో దూరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.









Comments