ఆర్‌సీ ప్లాస్టో నుంచి ట్యాంక్ స్టాండ్
హైదరాబాద్: ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. వాటర్ స్టోరేజీ ట్యాంకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్యాంక్ స్టాండ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వంద శాతం ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ స్టాండ్... వాటర్ ట్యాంకులను పటిష్ఠంగా ఉంచటంతో పాటు వాటి మన్నికను పెంచుతాయని వెల్లడించింది. ఈ స్టాండ్ 160ఎంఎం ఎత్తుతో ఉండటంతో ట్యాంక్ కింది భాగం సహా చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. 500, 750, 1000 లీటర్ల ట్యాంకుల కోసం అందుబాటులో ఉండే ఈ స్టాండ్‌ను 10 ఏళ్ల వారంటీని అందిస్తున్నట్లు ఆర్‌సీ ప్లాస్టో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్‌సీ ప్లాస్టో డీలర్ల వద్ద ఈ ట్యాంక్ స్టాండ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.









Comments